ఎల్లారెడ్డిపేట: సిరిసిల్ల పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టిన మధ్యాహ్న భోజన కార్మికులు
తమ సమస్యలు పరిష్కరించాలని మధ్యాహ్న భోజన కార్మికులు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట నేడు ధర్నా నిర్వహించారు. అనంతరం డీఈవోకు వినతి పత్రాన్ని అందజేశారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం పాఠశాలలో విద్యార్థులకు వారానికి 3సార్లు గుడ్డు అందించాలని ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు. కానీ మార్కెట్లో ఒక గుడ్డు ధర 8 రూపాయలు ఉంటే ప్రభుత్వం 5 రూపాయలు మాత్రమే చెల్లిస్తుందని ఆవేదన చెందారు.