కుప్పం: మండలంలో అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేయాలని కడా పీడీ వికాస్ మర్మత్కు మండల TDP అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ వినతి
కుప్పం మండల పరిధిలో అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేయాలని కడ పీడీ వికాస్ మర్మత్కు కుప్పం టీడీపీ మండల అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ సోమవారం నాడు 12 గంటల ప్రాంతంలో వినతిపత్రం సమర్పించారు. కుప్పం మండల పరిధిలోని పలు అంశాలను ఆయనకు వివరించారు. అర్హులందరికీ పింఛన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటామని పీడీ హామీ ఇచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు.