తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, పామిడి మాజీ జడ్పీటీసీ వీరాంజనేయులు అలియాస్ పామిడి వీరా లు శిఖండి రాజకీయాలు చేస్తున్నారని తాడిపత్రి మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్షావలి ఆరోపించారు. ఆయన మాట్లాడిన వీడియో గురువారం ఉదయం 10 గంటల సమయంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెద్దారెడ్డి తాడిపత్రి నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ కార్యకర్తల సమావేశాన్ని పామిడిలో పెట్టారన్నారు. అందుకు పామిడి వీరా సహకారం అందించారన్నారు. ఇద్దరు సంగతి తేలుస్తామన్నారు. శిఖండి రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు.