భువనగిరి: పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత ఎంపీడీవో రాములు నాయక్
యాదాద్రి భువనగిరి జిల్లా: ప్రతి ఒక్కరు ఇండ్లతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీడీవో రాములు నాయక్ గురువారం అన్నారు. గురువారం ఆత్మకూర్ ఎం మండలంలోని స్వచ్ఛతహి సేవా కార్యక్రమంలో భాగంగా ఎంపీడీవో రాములు నాయక్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రాములు నాయక్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛత హి సేవా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలన్నారు. పరిసరాల పరిశుభ్రత మొక్కలు నటువంటి కార్యక్రమాలు జీవన విధానంలో భాగస్వామ్యం కావాలని ఆయన తెలిపారు.