ఉప్పల్ ఎలివేటెడ్ కారిడాకు సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుభవార్త తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడా 2026 దసరా నాటికి పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. బుధవారం ఆర్ అండ్ బి, ఎం ఓ ఆర్ టి హెచ్ అధికారులకు, నిర్మాణ సంస్థకు మంత్రి ఆదేశాలు ఇచ్చారు. వెంటనే బీటి రోడ్డు పనులు చేపట్టాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో ప్రస్తుతం ఆ మార్గంలో రోడ్డు పనులు కొనసాగుతున్నాయి.