ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలలో స్వస్థ నారి, స్వశక్త్ పరివర్ పథకాన్ని ప్రారంభించిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి
Ongole Urban, Prakasam | Sep 17, 2025
ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రభుత్వ వైద్యశాలలో స్వస్థ నారి స్వశక్త్ పరివార్ కార్యక్రమాన్ని బుధవారం ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రారంభించారు. కలెక్టర్ రాజబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించగా కార్యక్రమానికి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు హాజరయ్యారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ రోజు మహిళల ఆరోగ్యం కొరకు మంచి పథకాన్ని ప్రారంభించారని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఈ అవకాశాన్ని మహిళలు అందరూ వినియోగించుకొని ఆరోగ్యంగా ఉండాలన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే తమ కుటుంబం కూడా ఆర్థికంగా ఎదుగుతుందని అన్నారు.