కబ్జాదారుల చెర నుండి నా భూమిని కాపాడాలంటూ మీడియా ముందు బాధితుడు
Ongole Urban, Prakasam | Mar 29, 2026
ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం మరి చెట్ల పాలెం లో ఉన్న తన స్థలాన్ని కొంతమంది వ్యక్తులు కబ్జా చేశారని దేవరపాలెం గ్రామానికి చెందిన వెంకటసుబ్బయ్య అనే వ్యక్తి ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలియజేశారు స్థానిక జాయింట్ కలెక్టర్ ను కలిసి స్పందనలో ఫిర్యాదు చేస్తే దానిపై వివరణ ఇవ్వాలని ఆమె స్థానిక ఎమ్మార్వో మరియు సర్వేయర్ ను కోరినట్లుగా తెలిపారు అయితే ఎమ్మార్వో సర్వేయర్లు తన వద్ద లక్ష రూపాయల డబ్బులు తీసుకుని కూడా కబ్జాదారులకు సాయం చేస్తూ తనను మానసికంగా హింసకు గురి చేస్తున్నాడని వాపోయాడు. కబ్జాదారుని శర నుండి తమ భూమిని కాపాడాలని వేడుకున్నాడు