బొప్పూడి గ్రామంలో దివ్య వనముల కార్యక్రమం నిర్వహణ
పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో దివ్య వనముల కార్యక్రమం చేపట్టారు. శ్రీ వెంకటేశ్వర స్వామి చెన్నకేశ్వర స్వామి మల్లేశ్వర స్వామి వార్ల దివ్య వనముల కార్యక్రమంలో పదిమంది ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు జడ్జిలు పాల్గొన్నారు. గ్రామానికి చెందిన హైకోర్టు జడ్జి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో జడ్జిలకు ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.