ముక్కంటి ఆలయంలో దర్శన వేళలో మార్పులు
శ్రీకాళహస్తి గుడి దర్శనాల్లో మార్పులు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో దళారుల ప్రమేయాన్ని తగ్గించడానికి గతంలో ఈవో బాపిరెడ్డి రూ.500 అంతరాయ దర్శనం ఏర్పాటు చేశారు. ఇది ఉదయం 6 నుంచి రాత్రి 8 వరకు అందుబాటులో ఉండేది. వాటిలో స్వల్ప మార్పులు చేశారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 6 నుంచి రాత్రి 8 వరకు, ఆదివారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3 వరకు, సోమ, శనివారం మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 8 వరకు అంతరాలయ దర్శనానికి అనుమతిస్తారు.