నంద్యాల–గిద్దలూరు జాతీయ రహదారిలోని నల్లమల అడవిలో శనివారం ఓ లారీ కొండను ఢీకొంది. ఈ ఘటనలో కానాలకు చెందిన డ్రైవర్ దూదేకుల బాలహుస్సేన్ (50) మృతిచెందారు. ప్రమాదంతో పాత రైల్వే బొగద సమీపంలో లారీ రైల్వే గోడను ఢీకొన్న కారణంగా వాహనాలు నిలిచిపోయాయి. మహానంది, గిద్దలూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేసే చర్యలు చేపట్టారు.