గుంటూరు: గాజా కోసం మౌనం కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం కావాలి:, సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి నేతాజీ
Guntur, Guntur | Jul 6, 2025 గాజా కోసం మౌనం' కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వామ్యమై ప్రతి రోజు రాత్రి 9 నుంచి 9.30 గంటల వరకు ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి సంఘీభావం తెలపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నేతాజీ పిలుపునిచ్చారు. బ్రాడీపేట సీపీఎం కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడారు. గత కొన్నేళ్లుగా ఇజ్రాయేల్ దుర్మార్గంగా గాజాపై దాడులకు పాల్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గాజాకు మానవతాధృక్పథంతో సహాయం అందించే ఇతర దేశాలకు ఆటంకం కలిగిస్తున్నారని ఆయన మండిపడ్డారు.