అసిఫాబాద్: శిథిలావస్థకు చేరుకున్న వాంకిడి ఎస్సీ వసతి గృహం:KVPS జిల్లా కార్యదర్శి దినకర్
వాంకిడి మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహం శిథిలావస్థకు చేరుకుందని KVPS జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. వాంకిడి మండల కేంద్రంలో బీసీ బాలుర వసతి గృహం కూడా ఇందులోనే కొనసాగుతుందని అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు స్లాబ్ పెచ్చులు ఊడి కిందా పడినట్లు తెలిపారు. దీంతో విద్యార్థులు దిక్కు బిక్కుమంటూ వసతి గృహంలో గడుపుతున్నారన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి నూతన వసతి గృహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.