అసిఫాబాద్: వాంకిడి చెక్ పోస్ట్ పై ఏసీబీ దాడులు
వాంకిడి రాష్ట్ర సరిహద్దు రవాణా శాఖ చెకోపోస్టుపై ఏసీబీ అధికారులు అర్థరాత్రి దాడులు నిర్వహించారు. వాహనాల నుంచి ప్రైవేట్ సిబ్బంది అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ దాడులు చేసినట్టు సమాచారం. ఇటీవల కాలంలో రవాణా శాఖ చెకోపోస్టులపై ఏకకాలంలో ఏసీబీ దాడులు నిర్వహించడం ఇది రెండోసారి.