మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలో గురువారం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో పాల్గొని మహిళలు ప్రతిభ చాటుతూ సంక్రాంతి పండుగను గుర్తు చేస్తూ ముగ్గులు వేశారు. పోటీలకు ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే నారాయణరెడ్డి హాజరై పండగ సందర్భంగా ముగ్గులు వేసి ప్రతిభ చాటిన మహిళలను ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం వారికి నగదు బహుమతులను ఎమ్మెల్యే అందజేశారు.