గుమ్మగట్ట మండలం గోనబావి గ్రామం వద్ద కుక్క అడ్డురావడంతో బైక్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం ఆదివారం రాత్రి సుమారు 10.30 సమయంలో చోటు చేసుకుంది. గాయపడిన వ్యక్తి బ్రహ్మసముద్రం మండలం గోవిందయ్య దొడ్డి గ్రామానికి చెందిన వ్యక్తి గా స్థానికులు గుర్తించారు. 108 కు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో వారు అక్కడికి చేరుకుని రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.