భారీ వర్షంతో నీట మునిగిన ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ కర్నూల్ రోడ్డు సెంటర్. అవస్థలు పడ్డ వాహనదారులు
Ongole Urban, Prakasam | Oct 22, 2025
దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారడంతో గడిచిన రెండు రోజుల నుండి చెదురు ముదురు వర్షాలు పడుతున్నాయి గడిచిన 12 గంటలుగా ఒంగోలు నగరం పరిసర ప్రాంతాలలో భారీ వర్షం కురవడంతో గురువారం ఉదయం ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ మరియు కర్నూలు రోడ్డు పూర్తిగా రెండు అడుగుల లోతు వరకు నీరు చేరింది దీంతో వాహనదారులు పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఆర్టీసీ డిపో వైపుకు మరియు పాట్ మార్కెట్ సెంటర్ వైపుకు వచ్చేటువంటి వాహనదారులు వర్షపు నీరు వాహనాలలోనికి పోవడంతో వాహనాలు ఆగిపోయి అనేక ఇబ్బందులు పడ్డారు సైట్ డ్రైనేజీల్లో నీరు పొంగి రోడ్డు పైగా రావడంతో ఇటువంటి పరిస్థితి ఏర్పడింది.