అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ తో పాటుగా మండలంలోని పలు గ్రామాల్లో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు వారి ఇళ్ల వద్దకే వెళ్లి అప్పగించినట్టు సీఐ రామారావు తెలిపారు. శుక్రవారం సీఐ రామారావు వివరాలను వెల్లడించారు. గుత్తి మండల పరిధిలోని 26 మంది సెల్ ఫోన్లు వేర్వేరు ప్రాంతాల్లో పోగొట్టుకున్నారు లేదా చోరీ అయ్యాయి. బాధితులుబిజిల్లా ఎస్పీకి మొబైల్ చాట్ బాట్ ద్వారా ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సెల్ ఫోన్లకు సంబంధించిన బిల్లులు, ఈఏంఐఈ నంబర్లు సేకరించి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సెల్ ఫోన్లు రికవరీ చేసి అప్పగించారు.