గుంతకల్లు నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సాయాన్ని అందిస్తున్నామని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ పేర్కొన్నారు. పట్టణంలోని కసాపురం రోడ్డులో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం రూ.28.2.195 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ బాధితులకు అందజేశారు. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ మాట్లాడుతూ చికిత్సలు చేయించుకొని ఆర్థిక స్తోమత లేని వారికి చెక్కులు అందజేశామని అన్నారు.