ప్రొద్దుటూరు: స్వరాజ్య నగర్,సంజీవ్ నగర్ ప్రాంతంలో స్మశాన వాటిక ఏర్పాటు చేయాలని తహసిల్దార్ గంగయ్య కి వినతిపత్రం
Proddatur, YSR | Nov 3, 2025 కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం స్వరాజ్య నగర్, సంజీవ నగర్ ప్రాంతాల్లో స్మశాన వాటిక ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాల నాయకులు కోరారు. సోమవారం మధ్యాహ్నం ఈ విషయమై స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గంగయ్య కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వరాజ్య నగర్, సంజీవ నగర్, ప్రాంతాలలో నివసించు మాల మాదిగల శ్మశాన వాటిక లేక పోవడం వలన, చనిపోయిన వారిని ఎక్కడ సమాధి చేయాలో తెలియని ఇబ్బందికర పరిస్థితులు వున్నాయని వివరించారు. సదరు ప్రాంతంలో వేల మంది నివసిస్తున్న జనాభాకు స్మశాన వాటిక లేనందువలన పరిస్థితి దారుణంగా వుందని తెలిపారు. కావున తహశీల్దార్ స్పందించి స్మశాన వాటిక సంబంధించిన