కుప్పం: కుప్పంలో ప్రవేశించిన పాలారు జలాలు
కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలకు పాలారు నది జలకళను సంతరించుకుంది. ఆంధ్ర - కర్ణాటక సరిహద్దులోని బేతమంగళం డ్యాం నిండి రామసాగరం చెరువు సైతం నిండి మరవ పోతోంది. దీంతో రామకుప్పం (M) కొల్లుపల్లి సమీపంలో పాలారు జలాలు కుప్పం నియోజకవర్గంలోకి ప్రవేశించాయి. కర్ణాటకలో 93 కిలోమీటర్లు, కుప్పం నియోజకవర్గంలో 33 కిలోమీటర్లు, ప్రవహించి తమిళనాడులోని ఐదు జిల్లాల్లో 220 కిలోమీటర్లు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది.