మదనపల్లెలో రోడ్డుపై దగ్ధమైన కారు తప్పిన పెను ప్రమాదం.
అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణం కదిరి రోడ్ లో రాయలసీమ స్కూల్ సమీపంలో ఆదివారం ఉదయం కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ఉన్న రఘునాథ, అతని స్నేహితుడు వెంటనే అప్రమత్తమై కారు దిగిపోవడంతో తప్పిన పెను ప్రమాదం. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం తెలిపారు. ఘటన స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపులో తెచ్చారు. మంటల్లో పూర్తిగా దగ్ధమైన కారు . పెట్రోల్ లీకేజీ కారణంగా మంటలు చెల్లరేగినట్లు ఓ సమాచారం ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.