మోటార్ బైక్ దొంగలు అరెస్టు,15 వాహనాలు స్వాధీనం చేసుకున్న చిలకలూరిపేట పోలీసులు
పల్నాడు జిల్లా,ఈపూరులో మోటార్ సైకిల్ దొంగలను పట్టుకొని వారి నుండి 15 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు నరసరావుపేట DSP హనుమంతరావు పేర్కొన్నారు.మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో DSP హనుమంతరావు వివరాలను వెల్లడించారు.మోటార్ సైకిళ్ళు పోయి నట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాలతో పోలీసులు ముప్పాళ్ళ రోడ్డులో గోపువారిపాలెం రోడ్డు వద్ద అనుమానాస్పద స్థితిలో సంచరిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న వారని గుర్తించి వారిని అరెస్టు చేయడం జరిగిందని DSP తెలిపారు