కేతేపల్లి: కేతేపల్లి మండలంలోని ప్రాజెక్టు నుంచి 5 గేట్లను మూడు అడుగుల మేర పైకెత్తిన అధికారులు
నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం లోని మూసి ప్రాజెక్టులోకి భారీగా వర్ధనీరు వచ్చి చేరుతుంది. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అధికారి ఏ ఈ ఉదయ్ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం ప్రాజెక్టులోకి భారీ వర్ద చేరడంతో ఐదు గేట్లను మూడు అడుగుల మేర పైకెత్తి దిగువన ఒక నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 9409.31 క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో 10,755.58 క్యూసెక్కులు ఉందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం 643.15 అడుగుల మేర నీరు ఉందని ఏఈ ఉదయ్ తెలిపారు.