రాజానగరం: కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని తక్షణమే అమలు చేయాలి డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ టీ.కే
ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 20వేల రూపాయలు రైతులు తక్షణమే అందించే చర్యలు చేపట్టాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ టి కె విశ్వేశ్వర రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం రైతులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రైతులకు 20 వేల రూపాయలు అందజేయడంతో పాటు యూరియా వరద లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.