అమరావతి పట్టణ పరిధిలో పొంగిపొర్లుతున్న కృష్ణమ్మ తల్లి
పల్నాడు జిల్లా అమరావతి పట్టణ పరిధిలోని పంచరామ క్షేత్రంలో ఒకటైన శ్రీ అమరేశ్వర స్వామి ఆలయం వద్ద కృష్ణానది పొంగిపొర్లుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు రావడంతో నదిలో నీటిమట్టం సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో పెరిగి శివాలయం స్థాన ఘట్టాలు మునిగిపోయాయి. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు వరద ను చూసి ఆనందించారు. భక్తులను నదిలోకి దిగవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.