పూతలపట్టు: బెంగళూరు రహదారి గుడ్డ కట్ట మంచి వద్ద రోడ్డు ప్రమాదం ఒకరికి తీవ్ర గాయాలు
బంగారుపాళ్యం మండలంలోని బెంగళూరు చెన్నై జాతీయ రహదారిపై గుండ్లకట్టమంచి వద్ద మంగళవారం ప్రమాదం జరిగింది. ముందుకు వెళ్తున్న టీవీఎస్ ఎక్స్‌ఎల్ వాహనాన్ని కేరళకు చెందిన యువకుడు నడుపుతున్న హిమాలయ ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చీకూరుపల్లి గ్రామానికి చెందిన సిమెంట్ అంగడి యజమాని ఎ. మోహన్ బాబు తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం అనంతరం వేలూరు నరువి ఆసుపత్రికి పంపించారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న దర్యాప్తు చేపట్టారు.