నవాబుపేట వద్ద రోడ్డు ప్రమాదం
నెల్లూరు నగర పరిధిలోని నవాబుపేట 3వ మైలు సమీపంలో హైవేపై ఆదివారం ప్రమాదం చోటుచేసుకుంది. ఓ లారీ డ్రైవర్ టైర్ పంచర్ కావడంతో సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనుకనే మంగళగిరి నుంచి కట్టెల లోడుతో వస్తున్న లారీ దానిని ఢీకొట్టింది. ఈ ఘటనలో కట్టెల లోడు లారీ ముందు భాగం నుజ్జవ్వగా డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డాడు.మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.