పూతలపట్టు: వాగులు వంకలు వద్ద ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ హెచ్చరిక
నీవానది వృద్రిక్తంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో పూతలపట్టు ఎమ్మెల్యే కలిగిరి మురళి మోహన్ బుధవారం మధ్యాహ్నం సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలోని మండలాల్లో ఎక్కడైతే వాగులు వంకలు ఉన్నాయో అక్కడ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు అవసరమైతే పంచాయతీ సెక్రెటరీ లేదా ఎంపీడీవో తహసిల్దార్ లేదా పోలీసులను సంప్రదించాలని కోరారు. వాగులు వంకలు ఉన్నచోట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు