పెద్దపప్పూరు మండలంలోని వరదాయపల్లిలో బుధవారం డబ్బు విషయమై గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ, వెంకటరాముడు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కర్రలతో ఇరువురు దాడి చేసుకోవ డంతో సల్పగాయాలయ్యాయి. విషయం తెలుకున్న ఎస్సై నాగేంద్ర ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకొని ఇరువురి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.