తాడిపత్రి: పెద్దపప్పూరులో సంక్రాంతి సందర్భంగా ఓపన్ కబడ్డీ, ఖో ఖో పోటీలు నిర్వహణ, విజేతలకు బహుమతులు ప్రదానం
పెద్దపప్పూరు మండల కేంద్రంలో మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామస్తుల ఆధ్వర్యంలో ఓపెన్ కబడ్డీ, ఖోఖో ఓటీలు నిర్వహించారు. కబడ్డీ పోటీల్లో 19 జట్లు, ఖో ఖో పోటీల్లో 9 జట్లు పాల్గొన్నాయి. ఎంతో రసవత్తరంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా పోటీలు నిర్వహించారు. కబడ్డీలో అనంతపురం విన్నర్స్, గార్లదిన్నె రన్నర్స్ గా నిలిచాయి. అదేవిధంగా ఖోఖో లో తుగ్గలి ప్రథమ స్థానం, కృష్ణాపురం ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. విజేతలకు వ్యాయామ ఉపాధ్యాయులు చంద్ర, శ్రీధర్, నిర్వాహకులు బహుబదులు ప్రదానం చేశారు.