పలమనేరు: పట్టణంలో జరిగిన ఆక్రమణలపై వైసీపీ టిడిపి కౌన్సిలర్లు తీవ్రవాగ్వాదం, వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిన అధికారులు
పలమనేరు: మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిల్ మీట్ నిర్వహించారు అధికారులు. ఈ కార్యక్రమానికి హాజరైన టిడిపి మరియు వైఎస్ఆర్సిపి కి చెందిన కౌన్సిలర్లు కుమార్, హైదర్, నాగరాజు, మండి సుధా పట్టణంలో పలుచోట్ల ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలు గురవుతున్న నేపథ్యంలో ఒకరిపై ఒకరు విమర్శలకు దిగుతూ తీవ్ర వాగ్వాదం పెట్టుకున్నారు. మున్సిపాలిటీకి సంబంధించిన స్థలాలలో ఆక్రమణలు ఉపేక్షించవద్దు ఎంతటి వారున్నా కూడా చర్యలు చేపట్టాల్సిందిగా కోరారు. దీనిపై అధికారులు మాట్లాడుతూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.