ఉదయగిరి: సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తలు వహించాలి : సీతారామపురం పిహెచ్సి డాక్టర్ స్వప్న
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీతారామపురం PHC డాక్టర్ స్వప్న అన్నారు. దోమలు పెరగకుండా ఇంటి చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, పాత టైర్లు, టబ్బులు, కొబ్బరి బొండాలు, కూలర్లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. నిల్వ నీటిలో దోమలు వృద్ధి చెందుతాయని, వాటివల్ల మలేరియా, డెంగ్యూ వంటి విషజ్వరాలు సోకుతాయన్నారు. ఎవరికైనా చలిజ్వరం, తలపోటు, దగ్గు ఉంటే హెల్త్ సెంటర్కి రావాలన్నారు.