ఉట్నూర్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై చలి పంజా, సిర్పూర్(యు)లో 7.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై చలి పంజా విసురుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలోనే ఉమ్మడి జిల్లాల్లో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సిర్పూర్ (యు) లో 7.9 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆదిలాబాద్ జిల్లా అర్లి (టీ)లో 9.2, నిర్మల్ జిల్లా పెంబిలో 10.3, మంచిర్యాల జిల్లా తపాలాపూర్లో 12.2 ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.