అసిఫాబాద్: ఆసిఫాబాద్ లో జాతీయ సమైక్యత దినోత్సవం వేడుకలు,పాల్గొన్న ఎమ్మెల్యే కోవ లక్ష్మీ
నిజాం నిరంకుశ పాలనకు స్వస్తిపలికి హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమైన రోజును తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంగా పాటిస్తున్నామని ASF ఎమ్మెల్యే కోవ లక్ష్మీ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆమె జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాచరిక వ్యవస్థ నుంచి తెలంగాణ సమాజం ప్రజాస్వామిక వ్యవస్థలోకి వచ్చి 77 సంవత్సరాలు పూర్తయ్యాయని అన్నారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు పాల్గొన్నారు..