నల్గొండ: తిరుమలగిరి సాగర్ మండల పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్
నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండల పోలీస్ స్టేషన్ను వార్షిక తనికెల్లో భాగంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ మంగళవారం సందర్శించి స్టేషన్ రికార్డులను పరిశీలించారు. స్టేషన్ కి వచ్చే ఫిర్యాదారులతో మర్యాదగా ప్రవర్తించాలని దొంగతనాల నివారణకు గస్తీ పెంచాలన్నారు.రిసెప్షన్ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఉమెన్ కానిస్టేబుల్ ఇంద్రజని ప్రత్యేకంగా అభినందించి రివార్డును అందజేశారు. అదేవిధంగా హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్స్ అనిల్ రవికుమార్ సాయికుమార్ హేమంత్ కుమార్ నాగరాజులను ప్రత్యేకంగా అభినందించారు.ఎస్సై వీరశేఖర్ ,సిఐ శ్రీను నాయక్, డిఎస్పి రాజశేఖర్ రాజు తదితరులు పాల్గొన్నారు.