గుంతకల్లు: గుంతకల్లు సంజీవ నగర్‌లో సాయిప్రసాద్ అనే వ్యక్తిపై వేటకొడవళ్లతో దాడి, పరిస్థితి విషమం
గుంతకల్లు పట్టణంలోని సంజీవనగర్ లో గురువారం రాత్రి సమయంలో సాయి ప్రసాద్ ఇంటి వద్ద ఉండగా కొందరు ఆటోలో వచ్చారు అతడి భార్య తల్లిని ఇంట్లోకి తోసి తలుపులు వేశారు. ఇంటి అద్దాలను పగలగొట్టారు సాయిప్రసాద్ పై వేటుపడవలతో దాడి చేసి పరారయ్యారు. ఈ దాడిలో తల కుడి ఎడమ కాలుకు గాయాలయ్యాయి కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు మెరుగైన వైద్యం కోసం సాయిప్రసాధన కర్నూల్ తరలించారు. నా మూడు రోజుల క్రితం చిన్న పిల్లల క్రికెట్ విషయంలో గొడవ కారణంగా ఈ దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.