తుంగభద్ర ఎగువకాలువకు తుంగభద్ర జలాలు నిలిపివేశారు. కర్నాటక లోని అంతర రాష్ట్ర జలాశయం తుంగభద్ర డ్యాం నుంచి అనంతపురం జిల్లాలోని హెచ్ఎల్సీ కాలువకు నీటిని ఆపేశారు. మన వాటాగా 28.75 టిఎంసిలు కాగా కెసి కెనాల్ వాటాతో కలిపి 30.73 టిఎంసిలు వరకూ వచ్చాయి. కణేకల్లు, బొమ్మనహాల్, డి.హిరేహాల్ మండలాల్లోని 30 వేల ఎకరాల వరకు సాగునీరు అందించారు. నీటిని బంద్ చేయడంతో కాలువలో ప్రవాహం తగ్గుముఖం పట్టింది. రేపటి ఉదయానికి పూర్తిగా ఆగిపోనున్నట్లు అధికారులు తెలిపారు.