ఈ నెల 23న గుండ్లూరు చెన్నకేశవ స్వామి ఆలయ భూములు కౌలుకు వేలంపాట :ఈఓ మంజుల
ఈ నెల 23న గుండ్లూరు చెన్నకేశవ స్వామి ఆలయ భూములు కౌలుకు వేలంపాట :ఈఓ మంజుల గుండ్లూరు చెన్నకేశవ స్వామి ఆలయ భూములు కౌలుకు వేలంపాటలను ఈ నెల 23న నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో మంజుల బుధవారం సాయంత్రం 6గంటలకు తెలిపారు. అన్నమయ్య జిల్లా, కలికిరి మండలం, గుండ్లూరు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం కు చెందిన భూములను మూడు సంవత్సరముల కాలానికి కౌలుకు ఇవ్వడానికి బహిరంగ వేళము ఈ నెల 23 అనగా గురువారం ఉదయం 11 గంటలకు శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం నందు నిర్వహించబడునని, ఆసక్తి కలవారు వెయ్యి రూపాయలు ధరావత్తు చెల్లించి వేలంపాటనందు పాల్గొనవచ్చునని ఆలయ ఈవో మంజుల తెలియజేశారు.