కుప్పం: చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి
రామకుప్పం మండలంలోని కెంచనబల్ల చెరువులో పడి సోమవారం ఇద్దరు యువకులు మృతి చెందారు. కోటచేను గ్రామానికి చెందిన సతీశ్, గోవిందరాజు చెరువులో దిగి పశువులను కడుగుతూ ప్రమాదవశాత్తు మునిగిపోయారు. స్థానికులు వారిని బయటికి తీయగా అప్పటికే చనిపోయారు. యువకుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.