జగిత్యాల: అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా
కరపత్రాలను ఆవిష్కరించిన జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్
అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఇందుకు సంబంధించిన కరపత్రాలను జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్, మరియు పౌరాణికప్రవచకులు బుర్రా భాస్కర శర్మ జిల్లా కేంద్రంలోని గీతాభవన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆవిష్కరించారు.జిల్లా కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం ఆధ్వర్యంలో కరపత్రాలను ఆవిష్కరించిన వారుమాట్లాడుతూ, ఓజోన్ పొర ను ఎలా కాపాడుకోవాలో, మనమే ఎలా నాశనం , చేసుకుంటున్నామొ వివరించారు. ఈ కార్యక్రమంలో గీతా భవన్ కార్యదర్శి, పంపట్టి రవీందర్,, తదితరులు పాల్గొన్నారు.