పుల్కల్: పర్యాటక కేంద్రంగా సింగూరు ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు అధికారులతో మంత్రి దామోదర క్షేత్రస్థాయి పర్యటన
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో సింగూరు ప్రాజెక్టును సందర్శించిన మంత్రి సింగూరును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు పలు సూచనలు చేస్తూ ప్రాజెక్టులో 50 సీట్ల సౌకర్యాలతో నడిచే రెండు బోట్లను, ఏర్పాటు చేయాలని పర్యాటక మరియు నీటిపారుగాల శాఖ మంత్రి అధికారులను ఆదేశించారు. పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నార