కరీంనగర్: మల్యాల పోలీసులు వేధిస్తున్నారని శ్రీనివాస్ అనే వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకొని ఎముకల మందు తాగి ఆత్మహత్యాయత్నం
కల్పన హోటల్ నందు గంగాధర మండలం హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన బండారి శ్రీనివాస్ అనునాతను మల్యాల పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని ఆరు నెలల క్రితం ఆర్టీసీ బస్సు వేస్తానని ఇంతవరకు వేయలేదు అని ఫేస్బుక్ లో పోస్ట్ చేయగా మల్యాల మండలంలోని నూకపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఫిర్యాదుతో అక్రమంగా మల్యాల పోలీస్ స్టేషన్ నందు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయించి మల్యాల పోలీస్ వారు తీసుకెళ్లి ఇబ్బందుల గురిచేసినారని ఆరోపిస్తూ కరీంనగర్ పట్టణంలోని కల్పన హోటల్ నందు ఎలుకల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. స్థానికులు సివిల్ ఆసుపత్రికి తరలించారు.