ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని పొదిలి రోడ్డులో గల విద్యుత్ కార్యాలయం వద్ద నాలుగు కోట్ల 19 లక్షల రూపాయలతో విద్యుత్ డివిజనల్ కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి టిడిపి జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.