పూతలపట్టు: పోలకల వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి
గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన గురువారం సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది స్థానికుల కథల మేరకు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలంలోని పోలకల రహదారిలో ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న సమయంలో పోలగల పంచాయతీ బీసీ కాలానికి చెందిన గిరిబాబు అనే వ్యక్తిని వెనక నుండి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు