యర్రగొండపాలెం: వై చర్లపల్లి గ్రామంలో ఆవులను పూజించి పరిగెత్తించడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం
ప్రకాశం జిల్లా దోర్నాల మండలం వైచర్లోపల్లి గ్రామంలో దీపావళి పండుగ సందర్భంగా వింత ఆచారం పాటిస్తున్నారు. దీపావళి సందర్భంగా గ్రామంలోని ప్రజలు బాణాసంచా కాలుస్తూ ఆవులను పరిగెత్తించే వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. ఆవులను ప్రత్యేకంగా పూజించి బాణాసంచా కాలుస్తూ పలు విధుల్లో పరిగెత్తిస్తారు. పూర్వీకుల నుంచి ఇలా చేస్తున్నామని దీంతో ఆవుల పై కొలువై ఉన్న దేవతల ఆశీస్సులు లభిస్తాయని గ్రామస్తులు తెలిపారు.