ఏలూరుజిల్లా వ్యాప్తంగా శ్రీదేవిశరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. భీమడోలుశ్రీకనకదుర్గమ్మ దసరా వేడుకలు పురస్కరించుకుని సోమవారం మూలనక్షత్రం సందర్బంగా మహిళలు విశేష పూజలు చేసారు. విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొని భక్తి శ్రద్దలతో అమ్మవారికి సరస్వతి పూజ చేసారు. ఉత్సవ కమిటీవారు తగిన ఏర్పాట్లు చేసారు. ఈసందర్బంగా నిర్వాహకులు మాట్లాడుతూ భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా పూజలు అందుకుంటున్న భీమడోలు ఈతకోటవారివీధి శ్రీకనకదుర్గమ్మ అమ్మవారి శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహించడం జరిగిందన్నారు. భీమడోలు పంచాయతీ కార్యదర్శి తనూజ పాల్గొన్నారు