సిర్పూర్ టి: మాజీ ఎమ్మెల్యే పాల్వాయి పురుషోత్తమ్ రావు 26వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన బిజెపి నాయకులు
కాగజ్నగర్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే దివంగత పాల్వాయి పురుషోత్తమరావు 26వ వర్ధంతి సందర్భంగా బిజెపి నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే నివాసంలో చిత్రపటానికి నౌగం బస్తిలో గల విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఘన నివాళులు అర్పించారు. దివంగత మాజీ ఎమ్మెల్యే పాల్వాయి పురుషోత్తమరావు ఆశయాలను సాధిస్తామని వారు చూపిన బాటలో నడుస్తామని ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు పేర్కొన్నారు,