కొండపి: 2 హెక్టార్లలో మాత్రమే పొగాకు రైతులు పొగాకు సాగు చేసేందుకు అనుమతులు ఉంటాయని వెల్లడించిన కొండపి పొగాకు బోర్డు అధికారులు
పొగాకు నారు పెంచే రైతులకు బోర్డు అధికారులు పలు సూచనలు చేశారు. ఒక రైతు గరిష్ఠంగా 2 హెక్టార్లు మాత్రమే పొగాకు పెట్టేందుకు అనుమతి ఉందన్నారు. ఎక్కువ విస్తీర్ణంలో పొగనారు నర్సరీలు పెడితే చర్యలు తప్పవన్నారు. సోమవారం కొండపి మండలంలో పొగాకు పొలాలను టెక్నికల్ ఫీల్డ్ అసిస్టెంట్ బ్రహ్మరెడ్డి పరిశీలించారు. నర్సరీ సాగుచేసే రైతులకు పలు సూచనలు చేశారు.