అనంతపురం నగరంలోని అమ్మ ఆసుపత్రి వద్ద ఆందోళన, చిన్నారి మృతికి ఆసుపత్రి యాజమాన్యం కారణమంటూ నిరసన
Anantapur Urban, Anantapur | Sep 27, 2025
అనంతపురం నగరంలోని అమ్మ ఆసుపత్రి వద్ద నగరంలోని 5వ రోడ్డుకు చెందిన బాధితులు తీవ్ర ఆందోళన. అప్పుడే పుట్టిన చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందడం పై బంధువులు ఆందోళన చేపట్టారు. ఆసుపత్రి నిర్లక్ష్యమే ప్రధాన కారణమని వారి తీరుకు నిరసిస్తూ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకున్న వినకుండా నిరసనను వ్యక్తం చేశారు. బంధువులలో ఒకరు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.