గుంతకల్లు: గుత్తిలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నరహరి కి పార్టీ శ్రేణులు, యువత ఘన స్వాగతం
వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నరహరి కి ఆదివారం రాత్రి గుత్తిలో ఘన స్వాగతం పలికారు. గుత్తి కోట ఉరుసుకు ఘంటా నరహరి భారీ కాన్వాయ్ తో వచ్చారు. వైసీపీ శ్రేణులు, స్నేహితులు, యువకులు, దర్గా కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. గాంధీ సర్కిల్ వద్ద నుంచి కోట వరకు బాణాసంచా కాలుస్తూ, డప్పులు కొడుతూ ఆనందంతో చిందులు వేస్తూ యువత కదిలింది. అనంతరం గంటా నరహరి దర్గాలో ప్రార్థనలు చేశారు.